IIRM లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (IIRM) 2019కి గాను పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 2019 కొత్త బ్యాచ్ జులైలో ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 24 నుంచి 26 వరకు మూడు రోజులు ఇంటర్వ్యూ జరుగుతోంది.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఏటీఎం, జీమ్యాట్, సీమ్యాట్, స్టేట్ లెవల్ మేనేజ్మెంట్ టెస్ట్ లో అర్హత కలిగి ఉండాలీ. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికా విధానం:
మేనేజ్మెంట్ టెస్ట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్ధులు డీడీ ద్వారా రూ. 500 చెల్లించాలి.