Ecil Hyderabad Recruitment : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.

Recruitment of Apprentice Posts in Electronics Corporation of India Limited
Ecil Hyderabad Recruitment : భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 284 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఆర్ అండ్ ఏసీ, ఎమ్‌ఎమ్‌వీ, టర్నర్, మెషినిస్ట్, ఎమ్‌ఎమ్ టూల్ మింట్, కార్పెంటర్, కోపా, డీజిల్ మెక్, ప్లంబర్, ఎస్‌ఎమ్‌ఎమ్, వెల్డర్, పెయింటర్ తదితర ట్రేడుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7700ల నుంచి రూ.8050ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ecil.co.in/ పరిశీలించగలరు.