Jobs : సెంట్రల్ స్కిల్ బోర్డ్ లో కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 64 సంవత్సరాల లోపు ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసి, ఇండియన్ లా సర్వీసెస్ నుండి రిటైర్డ్ అయిన అధికారులు అర్హులు. వీటికి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. రిటైర్డ్ పర్సన్స్ ను దీనికి అర్హులుగా పేర్కొన్నారు.

Jobs : సెంట్రల్ స్కిల్ బోర్డ్ లో కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీ

Skill Board

Updated On : July 26, 2022 / 8:21 PM IST

Jobs : బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 కన్సల్టెంట్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 64 సంవత్సరాల లోపు ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసి, ఇండియన్ లా సర్వీసెస్ నుండి రిటైర్డ్ అయిన అధికారులు అర్హులు. వీటికి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. రిటైర్డ్ పర్సన్స్ ను దీనికి అర్హులుగా పేర్కొన్నారు.

అభ్యర్థులు ఆగస్టు 9 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తారు కాంట్రాక్ట్ కాలం ఆరునెలలు. పనితీరు ఆధారంగా పొడిగించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను స్పీడ్ లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా సెక్రటరీ, సెంట్రల్ సిల్క్ బోర్డ్, బీటీఎం లేఅవుట్, మడివాలా, హోసూర్ రోడ్, బెంగళూరు560068, కర్ణాటక అనే చిరునామాకు పంపాలి.