jobs : ఎన్ఐటీఆర్ డీ లో ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. 30 ఏళ్ల లోపు అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Nitrd
jobs : కేంద్ర ప్రభుత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్‌క్యులాసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. 30 ఏళ్ల లోపు అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 30, 2022న నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ జరిగే అడ్రస్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్‌క్యులాసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్, శ్రీ అరంబిందో మార్గ్, కుతుబ్ మినార్ సమీపంలో, న్యూదిల్లీ -110030.
ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్ధులను జూనియర్ రెసిడెంట్లుగా నియామకం చేపడతారు. నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తివివరాలకోసం వెబ్‌సైట్ http://www.nitrd.nic.in/ను పరిశీలించగలరు.