NTPC Recruitment : ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునేందుకు ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు ప్రకారం ఇతరులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

NTPC Recruitment
NTPC Recruitment : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా 495 ఖాళీలను భర్తీ చేస్తారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి ఎలక్ట్రికల్: 120, మెకానికల్: 200, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్: 80, సివిల్: 30, మైనింగ్: 65 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Viral Video: బస్ సీట్లు ఎందుకు ముదురు రంగులో ఉంటాయి? కారణం తెలిస్తే ఇక కూర్చోవడమే మానేస్తారు
దరఖాస్తు చేసుకునేందుకు ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలలోపు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు ప్రకారం ఇతరులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక విధానం విషయానికి వస్తే అకడమిక్ మార్కులు, గేట్-2023 స్కోరు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు.
READ ALSO : Vijayawada : ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు .. భక్తుల కోసం ప్రత్యేక వసతులు
దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది అక్టోబరు 20గా నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో ఏడాది శిక్షణ తర్వాత మూడేళ్లపాటు విధిగా పనిచేస్తామంటూ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2.5 లక్షలకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ntpc.co.in/