Telangana University Recruitment : తెలంగాణ యూనివర్సిటీలో పలు టీచింగ్ పోస్టుల భర్తీ

అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులను రాత పరీక్ష, అకడమిక్ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Telangana University Recruitment : తెలంగాణ యూనివర్సిటీలో పలు టీచింగ్ పోస్టుల భర్తీ

Telangana University Recruitment :

Updated On : December 21, 2022 / 10:12 AM IST

Telangana University Recruitment : తెలంగాణ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. నిజామాబాద్‌లోని ఈ యూనివర్సిటీలో టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారంగాపూర్ క్యాంపస్, పీజీ కాలేజ్ భిక్‌నూర్‌ లో లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. . మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పార్ట్ టైమ్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో పార్ట్ టైం లెక్చరర్(ఎంఈడీ) (04), పార్ట్ టైం లెక్చరర్(ఎంఎస్సీ జువాలజీ) (03) ఖాళీలు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు యూజీసీ- నెట్‌/ సెట్‌/ స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్‌పై తప్పనిసరిగా పట్టుండాలి.

అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులను రాత పరీక్ష, అకడమిక్ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత కాలేజీకి ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 27-12-2022 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.telanganauniversity.ac.in/ పరిశీలించగలరు.