IIT Mandi Recruitment : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్ , ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30సంవత్సరాల లోపు ఉండాలి.

IIT Mandi Recruitment
IIT Mandi Recruitment : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండీలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్ , ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30సంవత్సరాల లోపు ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు యూఆర్, ఈడబ్ల్యుఎస్ అభ్యర్ధులు 500 రూపాయలు, ఓబీసీ 400 రూ, ఎస్సీ,ఎస్టీ దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులు 300 రూ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO : Haleem : పోషకాలతో నిండిన హలీమ్ ఆరోగ్యానికి మంచిదే !
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరితేదిగా 21 ఏప్రిల్ 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు సంబంధించి వెబ్ సైట్ ; https://www.iitmandi.ac.in/ పరిశీలించగలరు.