JOBS : మిలటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ లో పోస్టుల భర్తీ
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 20,000 నుంచి రూ. 35,000 వరకు చెల్లిస్తారు. అప్లికేషన్స్ ను ఈమెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పంపాలి.

Military Hospital Secunderabad
JOBS : సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో చైల్డ్ సైకాలజిస్ట్, పీడియాట్రిక్ కౌన్సెలర్, పీడియాట్రిక్ ఆడియాలజిస్ట్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు అర్హతలకు సంబంధించి అయా విభాగాల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 20,000 నుంచి రూ. 35,000 వరకు చెల్లిస్తారు. అప్లికేషన్స్ ను ఈమెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ secunderabadmh@gmail.com. మెయిల్, దరఖాస్తు కాపీలను పంపాల్సిన చిరునామా ; కమాండెంట్, మిలిటరీ హాస్పిటల్, సికింద్రాబాద్-500015 అడ్రస్‌కు పంపించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 5 ఆగస్టు2022గా నిర్ణయించారు. ఇంటర్వ్యూలను 7 ఆగస్టు2022న నిర్వహిస్తారు.