BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ
అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. . అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకొని, దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలనుతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

BDL Project Engineer
BDL Recruitment : హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎస్)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Coober Pedy : ఊరంతా రత్నాల గనులే.. ఇళ్లన్నీ గుట్టల్లోనే
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్(4 ఏళ్లు)/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటుగా కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30000 చెల్లిస్తారు.
READ ALSO : Reduce Cholesterol Levels : శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గించుకోవాలంటే ?
అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. . అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకొని, దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలనుతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక: ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సురంజన్ దాస్ రోడ్, ఇంజన్ డివిజన్ ఎదురుగా, బిన్న మంగళ, కొత్త తిప్పసంద్ర, వివేకానంద మెట్రో స్టేషన్ సమీపంలో , బెంగళూరు, కర్ణాటక – 560075. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bdl-india.in/ పరిశీలించగలరు.