AIIMS Rishikesh Recruitment : ఎయిమ్స్ రిషికేశ్ లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫారమ్‌లు ఆన్‌లైన్ మోడ్‌లో పంపాల్సి ఉంటుంది.

Vacancy
AIIMS Rishikesh Recruitment : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిషికేశ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ నాన్ అకడమిక్ పోస్టులు ఉన్నాయి.
READ ALSO : United States : యాంకర్‌కి లైవ్‌లో ప్రపోజ్ చేసిన రిపోర్టర్.. ఎక్కడంటే?
పోస్టులు ఖాళీలకు సంబంధించి విభాగాల విషయానికి వస్తే అనస్థీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, అప్తాల్మాలజీ, పాథాలజీ, ల్యాబ్ మెడిసిన్ తదితరాలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫారమ్‌లు ఆన్‌లైన్ మోడ్‌లో పంపాల్సి ఉంటుంది. ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 6, 2023లోపు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; aiimsrishikesh.edu.in పరిశీలించగలరు.