JOBS : బొకారో జనరల్ హాస్పిటల్ లో 34 నర్సు పోస్టుల భర్తీ

ఇంటర్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు 15020రూ స్టైఫండ్ గా చెల్లిస్తారు. జూన్ 6, 2022వ తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

JOBS : బొకారో జనరల్ హాస్పిటల్ లో 34 నర్సు పోస్టుల భర్తీ

Bokaro General Hospital

Updated On : June 3, 2022 / 11:51 AM IST

JOBS : భారత ప్రభుత్వ రంగ సంస్ధ సీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( సెయిల్) కు చెందిన బొకారో జనరల్ హాస్పటల్ లో నర్సు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్, డిప్లొమా(జీఎన్ ఎం) ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు, అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లకు మించరాదు.

ఇంటర్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు 15020రూ స్టైఫండ్ గా చెల్లిస్తారు. జూన్ 6, 2022వ తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్యూ జరిగే చిరునామా ; కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, బొకారో స్టీల్ ప్లాంట్, బొకారో జనరల్ హాస్పటల్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.sail.co.in/ పరిశీలించగలరు.