NIT Rourkela Job Vacancies : రూర్కెలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ. 2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 16, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

NIT Rourkela Job Vacancies :
NIT Rourkela Job Vacancies : కేంద్ర విద్యాశాఖకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 147 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి లైబ్రేరియన్ పోస్టులు: 1, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1, సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులు: 1, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు: 1, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ (ఎస్‌ఏఎస్) ఆఫీసర్ పోస్టులు: 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 4, మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 3, సూపరింటెండెంట్ పోస్టులు: 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 36, జూనియర్ ఇంజినీర్ పోస్టులు: 3, ఎస్‌ఏఎస్ అసిస్టెంట్ పోస్టులు: 1, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు: 3, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 13, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 25, సీనియర్ టెక్నీషియన్ పోస్టులు: 12, టెక్నీషియన్ పోస్టులు: 29
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్ /బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/ఎమ్సెస్సీ/ఎమ్‌సీఏ/ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా పోస్టులకు సంబంధించిన పనిలో అనుభవం కూడా ఉండాలి. వయసు 27 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.
రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ. 2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 16, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitrkl.ac.in/ పరిశీలించగలరు.