SBI CBO Recruitment 2023 : ఎస్‌బీఐలో 5447 సీబీవో పోస్టుల భర్తీ.. తెలుగు రాష్ట్రల్లో 825 ఖాళీలు

మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.

SBI CBO Recruitment 2023 : ఎస్‌బీఐలో 5447 సీబీవో పోస్టుల భర్తీ.. తెలుగు రాష్ట్రల్లో 825 ఖాళీలు

SBI CBO Recruitment 2023

SBI CBO Recruitment 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో ఖాళీల భర్తీ చేపట్టనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (Circle Based Officer) పోస్టులను భర్తీచేయనుంది. భర్తీ చేయనున్న ఖాళీల్లో రెగ్యులర్ పోస్టులు-5280, బ్యాక్‌లాగ్ పోస్టులు-167 ఉన్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

READ ALSO : Delhi : బిర్యానీ కోసం యువకుడిని హత్య చేసిన బాలుడు .. మృతదేహం పక్కనే డ్యాన్స్

అభ్యర్థులు డిసెంబరు 12 వ తేదిలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలకు సబంధించి ;

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీల సంఖ్యకు సంబంధించి మొత్తం 5447 (రెగ్యులర్ పోస్టులు ఉండగా వాటిలో 5280 రెగ్యులర్ పోస్టులు, బ్యాక్‌లాగ్ పోస్టులు – 167

తెలుగు రాష్ట్రాల పరిధిలో :

అమరావతి – 400, హైదరాబాద్ – 425 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : IDBI Bank Recruitment 2023 : IDBI లో 2100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ

అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 – 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాలు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : గూగుల్ పే యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్ యమ డేంజర్

దరఖాస్తు ఫీజు:

రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు:

ఎంపికైన వారికి నెలకు రూ.36,000 – రూ.63,840.

READ ALSO : Gastric Cancer : కడుపులో ఇన్ఫెక్షన్ సమస్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీస్తాయా ?

పరీక్ష విధానం:

మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అలాగే 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, ఎస్సే) ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు. ఇంటర్యూకు 50 మార్కులు కేటాయించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు.

READ ALSO : Buggana Rajendranath : అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 22.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది : ‌12.12.2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.