SBI Recruitment 2025: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. 5,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. డైరెక్ట్ లింక్ తో ఇలా అప్లై చేసుకోండి

SBI Recruitment 2025: బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

SBI Recruitment 2025: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. 5,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. డైరెక్ట్ లింక్ తో ఇలా అప్లై చేసుకోండి

SBI has released a notification for the recruitment of Junior Associate posts.

Updated On : August 6, 2025 / 12:31 PM IST

బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో దేశవ్యాప్తంగా ఉన్న 5,000కు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 26, 2025 వరకు కొనసాగనుంది. కాబట్టి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.sbi.co.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఖాళీల వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్‌ లో 310 పోస్టులు
  • తెలంగాణలో 250 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల నియామకాలు మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. అందులో మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్స్ పరీక్ష, చివరిది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (భాషా ప్రావీణ్యత పరీక్ష). ఈ మూడింటిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:
జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు ఉండదు. వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది.