SSC Sub Inspector Recruitment : డిగ్రీ అర్హతతో ఎస్‌ఐ ఉద్యోగాలు భర్తీ.. ఆగస్టు 15తో ముగియనున్న దరఖాస్తు గడువు

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఆన్‌లైన్‌ పరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు.

SSC Sub Inspector Recruitment : డిగ్రీ అర్హతతో  ఎస్‌ఐ ఉద్యోగాలు భర్తీ.. ఆగస్టు 15తో ముగియనున్న దరఖాస్తు గడువు

SSC Sub Inspector Recruitment

Updated On : August 6, 2023 / 11:27 AM IST

SSC Sub Inspector Recruitment :కేంద్ర సాయుధ దళాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌లతోపాటు ఢిల్లీ పోలీస్‌ విభాగంలో 1876 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SI) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. విభాగాల వారిగా పోస్టులకు సంబంధించి సీఆర్‌పీఎఫ్‌ 818, బీఎస్‌ఎఫ్‌ 113, ఐటీబీపీ 63, సీఐఎస్‌ఎఫ్‌ 630, ఎస్‌ఎస్‌బీ 90 ఖాళీలు ఉండగా దిల్లీ పోలీస్‌కు సంబంధించి పురుషులకు 109, మహిళలకు 53 పోస్టులు కేటాయించారు.

READ ALSO : Banana : వర్షకాలంలో అరటి పండు తినకూడదా ?

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. ఆన్‌లైన్‌ పరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ వైద్య పరీక్షల విధానంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల జీతం చెల్లిస్తారు. అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.

READ ALSO : Lavender Tea : లావెండర్‌ టీలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు !

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజుగా రూ.100 నిర్ణయించారు మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదిగా ఆగస్టు 15, 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://ssc.nic.in/ పరిశీలించగలరు.