SSC CGL Recruitment: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ అప్డేట్.. రిజర్వేషన్ల వారీగా ఖాళీల ప్రకటన.. ఆగస్టు 13 నుంచి టైర్‌ 1 ఎగ్జామ్స్

SSC CGL Recruitment: ప్రభుత్వ విభాగాలలో, మంత్రిత్వ శాఖలలో ఉన్న ఖాళీల వివరాలను విడుదల చేసింది. అది కూడా రాష్ట్ర వారీగా, జోన్ల వారీగా కాకుండా రిజర్వేషన్ల వారీగా విడుదల చేసింది.

SSC CGL Recruitment: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ అప్డేట్.. రిజర్వేషన్ల వారీగా ఖాళీల ప్రకటన.. ఆగస్టు 13 నుంచి టైర్‌ 1 ఎగ్జామ్స్

Staff Selection Commission announces details of vacancies by reservation

Updated On : August 3, 2025 / 2:42 PM IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక అప్డేట్ ఇచ్చింది. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వ విభాగాలలో, మంత్రిత్వ శాఖలలో ఉన్న ఖాళీల వివరాలను విడుదల చేసింది. అది కూడా రాష్ట్ర వారీగా, జోన్ల వారీగా కాకుండా రిజర్వేషన్ల వారీగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా ఎస్‌ఎస్‌సీ ఖాళీల జాబితాను డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.

అయితే, ఇది తాత్కాలికమైనది మాత్రమే. తుది ఫలితాలు విడుదల అయిన తరువాత ఇందులో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ సీజీఎల్‌ గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలింసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన టైర్‌-I పరీక్షలు ఆగస్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. అలాగే టైర్‌-II పరీక్షలు డిసెంబర్‌లో మొదలుకానున్నాయి.