SSC Recruitment : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి విద్యార్హత ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

SSC Recruitment : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

SSC Recruitment :

Updated On : November 19, 2022 / 8:05 PM IST

SSC Recruitment : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలను భారీగా చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24, 369 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్, సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి విద్యార్హత ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయోపరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాల విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి గడువు నవంబరు 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ssc.nic.in పరిశీలించగలరు.