CHSL Admit Card : సీహెచ్‌ఎస్‌ఎల్-2023 ‘టైర్-2’ అడ్మిట్ కార్డులు విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
ఈ నోటిఫికేషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

Staff Selection Commission
CHSL Admit Card : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2023 టైర్-2 రాత పరీక్ష అడ్మిట్ కార్డుల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆమేరకు అధికారిక వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.
READ ALSO : Custard Apple : శీతాకాలం సీజన్‌లో సీతాఫలం తినటం వల్ల కలిగే ప్రయోజనాలు !
దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవబర్ 2న టైర్ 2 పరీక్ష జరగనుంది. టైర్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తరువాత అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 1,762 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మే నెలలో ఈ నియామకాల కోసం ఎస్ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (10+2) టైర్ 2 పరీక్ష కోసం SSC CHSL అడ్మిట్ కార్డ్ 2023 మొత్తం 9 ప్రాంతాలకు వారిగా ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో విడుదల చేశారు. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను నమోదు చేసుకుని వారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలోని వెబ్ సైట్ ద్వారా SSC CHSL హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.ssc.nic.in పరిశీలించగలరు.