Staff Selection Commission : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ కేటగిరీల్లో 1920 పోస్టుల భర్తీ
దరఖాస్తు ప్రక్రియ మే 12, 2022 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు జూన్ 13, 2022 తుదిగడువుగా నిర్ణయించారు.

|Staff Selection Commission
Staff Selection Commission : న్యూదిల్లీ లోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, ఇతర విభాగాల్లో 334 కేటగిరీల్లో ఫేజ్ 10 క్రింద సెలక్షన్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1920 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు ప్రక్రియ మే 12, 2022 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు జూన్ 13, 2022 తుదిగడువుగా నిర్ణయించారు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ అధారిత రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకోసం వెబ్‌సైట్ https://ssc.nic.in/ పరిశీలించగలరు.