SSCలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 04:56 AM IST
SSCలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

Updated On : May 8, 2019 / 4:56 AM IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. పదోతరగతి, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి క్రమం తప్పకుండా ఏప్రిల్ 22న వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. మొత్తం 1000 పోస్టుల్ని భర్తీ చేస్తుంది. సెప్టెంబర్ చివరి వారంలో పేపర్ 1, డిసెంబర్ లో పేపర్-2 ఫలితాలు ప్రకటిస్తారు. అభ్యర్ధులు 18 నుంచి 27 మధ్య వయసు ఉండాలి.

* ముఖ్యమైన తేదీలు:
– నోటిఫికేషన్ రిలీజ్: ఏప్రిల్ 22, 2019 
– దరఖాస్తుకు చివరి తేదీ: మే 22, 2019
– పేపర్ 1 (రాత పరీక్ష): ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 6
– పేపర్ 2 (రాత పరీక్ష): నవంబర్ 17

* పరీక్ష విధనం:
పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పేపర్-1 లో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ తప్పుకు 0.25 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పేపర్-1 పరీక్షా సమయం 120 నిమిషాలు. పేపర్-2లో డిస్క్రిప్టీవ్ విధానంలో ఉంటుంది. ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ ఉంటాయి. పరీక్షా సమయం రెండున్నర గంటలు.