మేం చచ్చిపోతాం : HRCకి గ్రూప్ – 2 అభ్యర్థుల వినతి

కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తెలంగాణా గ్రూప్-2 అభ్యర్థులు మానవహక్కుల కమిషన్ ఆశ్రయించడం కలకం రేపింది. ఫలితాలు వచ్చాయి..రెండేళ్లు అయ్యింది..ఎక్కడ ఉద్యోగం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఓపిక నశించి పోయిందని..ఎంతో మానసికక్షోభకు గురయ్యామని వారు కమిషన్ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీ శుక్రవారం అభ్యర్థులు భారీగా HRC కార్యాలయానికి తరలివచ్చారు.
Read Also : ఎన్నికల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్లయింట్
రెండున్నరేళ్లుగా టీపీసీసీ, ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేస్తోందని..గ్రూప్ 2 మెరిట్ జాబితాలో ఉన్నా ఇప్పటికీ ఫలితాలు వెలువడలేదని వారు చెప్పారు. కేవలం టీఎస్పీఎస్సీ చేస్తున్న అలసత్వం వల్లే తామింకా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించాలని తాము ఎన్నోమార్లు ఆందోళనలు, పోరాటాలు చేసినా స్పందన లేదని అభ్యర్థులు వెల్లడించారు. ఉద్యోగాలు రాకపోవడంతో వేరే ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, దీనివల్ల తాము ఎన్నో అవమానాలు ఎదర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్