TG LAWCET 2025: తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఒక్క క్లిక్ తో రిజల్ట్స్, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు తెలుసుకోండి

TG LAWCET 2025: తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

TG LAWCET 2025: తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఒక్క క్లిక్ తో రిజల్ట్స్, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Telangana LawCET 2025 Counseling First Phase Registration Started

Updated On : August 6, 2025 / 1:04 PM IST

తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ – 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్ట్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా వారికీ సీట్లను కేటాయిస్తారు అధికారులు.

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు, వివరాలు:

  • ఆగస్టు 4వ తేదీ నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది.
  • ఆగస్టు 21, 22 తేదీల్లో మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి.
  • ఆగస్టు 23వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
  • ఆగస్టు 28వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
  • ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి.
  • రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ:

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://lawcetadm.tgche.ac.in/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో రిజిస్ట్రర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
  • లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి.

మీ లాసెట్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://lawcet.tgche.ac.in/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
  • వ్యూ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఫలితం స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి
  • దానిని ప్రింట్/డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

ఇక ఈ ఏడాది తెలంగాణ లాసెట్‌ పరీక్షకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది హాజరయ్యారు. టీజీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే 9908021100, 7207341100 నెంబర్లను సంప్రదించవచ్చు.