UPSC Free Coaching: గుడ్ న్యూస్.. యూపీఎస్‌సీ ఫ్రీ కోచింగ్.. దరఖాస్తులు మొదలయ్యాయి.. లాస్ట్ డేట్, ఫుల్ డీటెయిల్స్
UPSC Free Coaching: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ 2025 కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు.

Telangana State Minority Study Circle Free Coaching for UPSC Exam
మీరు యూపీఎస్‌సీ(UPSC)కి ప్రిపేర్ అవుతున్నారా? కోచింగ్ తీసుకునేంత ఆర్ధిక స్థోమత లేదా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ (TGMSC), హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) 2025 కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్నిప్రారంభించనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మైనారిటీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఈమేరకు సోమవారం (జులై 28) అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉచిత శిక్షణ హైదరాబాద్ లోని TGMSC ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.
అర్హత వివరాలు:
- ఈ ఉచిత శిక్షణ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వర్గానికి చెందినవారై ఉండాలి
- అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
- స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయినా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్, సమగ్ర శిక్షణ ఇస్తారు.
ఆసక్తిగల అభ్యర్థులకు TGMSC అధికారిక వెబ్‌సైట్ https://www.tgmsc.in లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 14, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్ష తేదీని వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. మరిన్ని సందేహాల కోసం హైదరాబాద్ TGMSC కార్యాలయాన్ని, లేదా వెబ్‌సైట్‌లో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కాల్/ మెయిల్ చేయొచ్చు.