శుభవార్త : వారం రోజుల్లో 3వేల ఉద్యోగాలు

హైదరాబాద్: రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త వినిపించింది. పెండింగ్‌లో ఉన్న 3వేల ఉద్యోగాలను వారం రోజుల్లో భర్తీ చేస్తామని

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 02:42 AM IST
శుభవార్త : వారం రోజుల్లో 3వేల ఉద్యోగాలు

Updated On : January 27, 2019 / 2:42 AM IST

హైదరాబాద్: రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త వినిపించింది. పెండింగ్‌లో ఉన్న 3వేల ఉద్యోగాలను వారం రోజుల్లో భర్తీ చేస్తామని

హైదరాబాద్: రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త వినిపించింది. పెండింగ్‌లో ఉన్న 3వేల ఉద్యోగాలను వారం రోజుల్లో భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటివరకు 18 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 2018లో 10వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. 2019, జనవరి 27వ తేదీ శనివారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండాను ఘంటా ఆవిష్కరించారు.

 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని, ఈ నాలుగేళ్లలో 20వేల ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదని ఘంటా చక్రపాణి అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సమస్యలు, కోర్టు కేసుల ఇబ్బందుల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి సంబంధం లేనప్పటికీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. కొన్ని శాఖలు రిక్రూట్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నాయని, గ్రూప్ పరీక్షలు, పాలనాపరమైన ఉద్యోగాల భర్తీ మాత్రమే టీఎస్‌పీఎస్సీ పని అని వెల్లడించారు. ట్యూటర్లు, పారా మెడికల్, టీచర్ పోస్టుల భర్తీ పూర్తి అయితే దాదాపు అన్ని పూర్తయినట్టేనని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలు, విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లు ఏమీ లేవన్నారు. కమిషన్‌కున్న పలు సమస్యలు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు.