CMS ఎగ్జామ్- 2019 నోటిఫికేషన్ విడుదల

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 11:10 AM IST
CMS ఎగ్జామ్- 2019 నోటిఫికేషన్ విడుదల

Updated On : April 10, 2019 / 11:10 AM IST

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 965 పోస్టులను భర్తీ చేయనున్నారు. MBBS అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Read Also : మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్

వయసు పరిమితి: 
32 సంవత్సరాలకు మించకూడదు.

పరీక్ష విధానం..
* మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరకు 250 మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు. 

* పేపర్-1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ గురించి, పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ & అబ్‌స్ట్రేట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం  10.04.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది   06.05.2019.
పరీక్ష తేది      21.07.2019.