Vacancies In C-DAC : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ లో ఖాళీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Vacancies in Center for Development of Advanced Computing
Vacancies In C-DAC : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్)లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. డేటా సెంటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఎంబడెడ్ సిస్టమ్ గ్రూపుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. వయసు తప్పనిసరిగా 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://careers.cdac.in/ పరిశీలించగలరు.