RTC Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలు భర్తీ, ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..

వీటిలో 2 వేల డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్‌).

RTC Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలు భర్తీ, ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..

Updated On : April 20, 2025 / 6:37 PM IST

RTC Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. త్వరలోనే 3వేల 38 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందిని మంత్రి వెల్లడించారు.

బస్ డ్రైవర్లతో పాటు పలు విభాగాల్లో పోస్టులు భర్తీ చేయబోతున్నారు. కొత్త బస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందన్నారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తూ దాదాపు 60వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు మంత్రి పొన్నం. మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్ ను జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాగా ప్రిపేర్ కావాలని సూచించారు.

Also Read: తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఉద్యోగులను తీసుకున్నది లేదు. తాజాగా మంత్రి చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం నింపింది. ఇటీవలి కాలంలో 3వేల మంది ఉద్యోగులు ఆర్టీసీలో రిటైర్ అయినట్లు సమాచారం. దీంతో ఆ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. త్వరలో దీనికి మోక్షం లభించనుంది. తాజా పోస్టుల్లో ఎక్కువగా డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుతం బస్సుల సంఖ్య పెరుగుతుండగా, డ్రైవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో 2వేల మంది డ్రైవర్లను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏ విభాగంలో ఎన్ని పోస్టులు..
2 వేల డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్‌), 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానికల్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 18 అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌), 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌), 6 అకౌంట్‌ ఆఫీసర్స్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌ జనరల్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here