Assembly Elections 2023: మళ్లీ అధికారంలోకి వస్తే.. మహిళలకు చాలా పెద్ద హామీ ఇచ్చిన సీఎం
తల్లులు, సోదరీమణులందరికీ నేను ఒక్క విషయం స్పష్టం చేస్తాను. మీరు ఎక్కడా లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫారమ్‌ను నింపాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ప్రభుత్వమే మీ ఇళ్ల సర్వే నిర్వహిస్తుంది

Chhattisgarh CM Bhupesh Baghel: దీపావళి సందర్భంగా మహిళలకు భారీ కానుక ఇస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవి అనుగ్రహం, ఛత్తీస్‌గఢ్ మహతారి ఆశీస్సులతో రాష్ట్రంలో మహిళా శక్తి కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సీఎం బఘేల్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలోని మహిళలకు “ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజన” కింద వారి ఖాతాల్లో నేరుగా సంవత్సరానికి రూ.15,000 వేస్తామని ఆయన అన్నారు.
వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం భూపేష్ బఘెల్ భారీ ప్రకటన చేశారు. సీఎం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘‘నా తల్లులు, సోదరీమణులారా! ఈ రోజు దేవరీ శుభ సందర్భంగా, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి ఒక్కరికి లక్ష్మీ దేవి అపారమైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఐదేళ్లపాటు ఛత్తీస్‌గఢ్ ప్రజలకు మాతా లక్ష్మి ఆశీస్సులు అందించి ‘గర్బో నవ ఛత్తీస్‌గఢ్’ అనే మా మిషన్‌ను ప్రారంభించాము. నా ఛత్తీస్‌గఢ్ సంపన్నంగా ఉండాలని, పేదరికం అనే శాపాన్ని తరిమికొట్టాలనే సంకల్పంతో మా ప్రభుత్వం ఐదేళ్లు పనిచేసింది. ఈ రోజు దేవారి పవిత్రమైన రోజు సందర్భంగా.. మన తల్లులు, సోదరీమణులు మరింత సంపన్నులు, శక్తి-సామర్థ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము’’ అని రాసుకొచ్చారు.
ఇంకా సీఎం స్పందిస్తూ.. ‘‘ఈ రోజు దేవరీ శుభ సందర్భంగా, మీరు కాంగ్రెస్‌కు ఓటు వేయండి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేను ప్రకటిస్తున్నాను. కాంగ్రెస్ అదికారంలోకి రాగానే ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజనని ప్రారంభిస్తాము. దీని కింద ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తాము. తల్లులు, సోదరీమణులందరికీ నేను ఒక్క విషయం స్పష్టం చేస్తాను. మీరు ఎక్కడా లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫారమ్‌ను నింపాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ప్రభుత్వమే మీ ఇళ్ల సర్వే నిర్వహిస్తుంది. అంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది. నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి’’ అని అన్నారు.