Karnataka Polls: కర్ణాటక యుద్ధంలో హోరాహోరీగా కాంగ్రెస్, బీజేపీ.. ఎవరు గెలిచినా సౌత్ నుంచి ఇంకొకరు ఔట్

హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. నిజానికి కర్ణాటకలో హంగ్ అనేది తరుచూ ఎదరుయ్యే పరిణామమే. కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీగా జేడీఎస్ ఎప్పటి నుంచో ఉంది. రెండు జాతీయ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా ఈ పార్టీ అడ్డుకుంటోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది. దీంతో కాంగ్రెస్, బీజేపీల ఘర్షణ కారణంగా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత తీసుకుంది

Karnataka Polls: కర్ణాటక యుద్ధంలో హోరాహోరీగా కాంగ్రెస్, బీజేపీ.. ఎవరు గెలిచినా సౌత్ నుంచి ఇంకొకరు ఔట్

Congress and BJP

Karnataka Polls: దక్షిణాదిలోనే కాదు, దేశంలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద ఎత్తున చర్చలో ఉంటాయి. కారణం.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దక్షిణాదిలో ఎదురెదురుగా తలపడేది ఈ ఒక్క రాష్ట్రంలోనే. అందుకే ఈ రాష్ట్రం ఆ రెండు పార్టీలకు చాలా కీలకం. అయితే ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకోబోతోంది. సర్వేల ఫలితాలు అటుంచితే.. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు గెలిచినా ఇంకొకరు దక్షిణ భారత దేశం నుంచి ఔట్ అవుతారు.

Bangladesh: బంగ్లా బట్టల బజార్‭లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు

వాస్తవానికి దక్షిణాదిలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే కొంత బలం ఉన్నప్పటికీ.. ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. కేరళలో, కర్ణాటకలో ప్రతిపక్షంలో మాత్రం ఉంది. దేశం మొత్తంలో కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లోనే స్వతంత్రంగా అధికారంలో ఉంది. ఇక బీజేపీ దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే బలంగా ఉంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో ఉంది. మిగిలిన ఏ దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకునేంత బలం కూడా లేదు.

SCs and STs: ఎస్సీ, ఎస్టీల మానవాభివృద్ధి సూచీలో మెరుగుదల.. వెల్లడించిన కేంద్రం

అయితే ఇప్పటికే దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే ఎప్పటిలాగే సౌతులో జీరోగానే మిగిలిపోతుంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఉత్తరాదిలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. సౌత్ నుంచి పూర్తిగా ఔట్ అవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి అంత పోటీ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో మాత్రం చాలా బలంగా ఉంది. ఇప్పటికే వెల్లడైన ఓపీనియన్ పోల్స్ ప్రకారం చూస్తే.. కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.

Mamata Banerjee: బెంగాల్‭లో అల్లర్లకు బిహార్ గూండాల్ని తెచ్చిన బీజేపీ.. మమత సంచలన ఆరోపణలు

ఈ రెండు కాకుండా.. హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. నిజానికి కర్ణాటకలో హంగ్ అనేది తరుచూ ఎదరుయ్యే పరిణామమే. కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీగా జేడీఎస్ ఎప్పటి నుంచో ఉంది. రెండు జాతీయ పార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా ఈ పార్టీ అడ్డుకుంటోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది. దీంతో కాంగ్రెస్, బీజేపీల ఘర్షణ కారణంగా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత తీసుకుంది. అనంతరం ఆ ప్రభుత్వం కూలినప్పటికీ.. చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలకు పక్కలో బళ్లెంలా జేడీఎస్ కనిపిస్తోంది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.