Reena Kashyap: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక మహిళ గెలిచింది
వాస్తవానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నారు. 1998 నుంచి రాష్ట్రంలో మహిళా ఎక్కువగా ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు వారే ఎక్కువ. అంతే కాకుండా, పోలింగులో పాల్గొనే వారిలో కూడా మహిళలే అత్యధికులు. గత ఎన్నికల్లో కూడా మగవారు 70.58 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మహిళలు 77.98 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Every second voter a female, but only one woman MLA in Himachal Pradesh
Reena Kashyap: 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క మహిళ గెలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లోనూ మగవారే విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన రీనా కశ్యప్ అనే మహిళా అభ్యర్థి పచ్చడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దయాల్ ప్యారిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు కూడా తక్కువగానే ఉన్నారు. కేవలం 24 మంది మాత్రమే పోటీ చేశారు. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది సగం సంఖ్య కూడా కాదు.
ఇందులో బీజేపీ నుంచి ఎక్కువగా ఆరుగురు పోటీ చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు మహిళలు రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే పోటీ చేశారు. ఇందులో రీనా కశ్యప్ మాత్రమే గెలిచారు. వాస్తవానికి 2021లో పచ్చడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కశ్యప్ గెలిచారు. ఈ ఎన్నికలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు
గత ఎన్నికలో (2017) నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వారంతా ఓటమి పాలయ్యారు. ఇందులో షహపూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేసిన సర్వీన్ చౌదరి, సీనియర్ కాంగ్రెస్ నేత, దలోసీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా కుమారి (ఈమె ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు), ధిమన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత ఇందోర రీట, కాంగ్రెస్ సీనియర్ నేత కౌల్ సింగ్ కూతురు, మండి నుంచి గెలుపొందిన చంపా ఠాకూర్ ఉన్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నారు. 1998 నుంచి రాష్ట్రంలో మహిళా ఎక్కువగా ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు వారే ఎక్కువ. అంతే కాకుండా, పోలింగులో పాల్గొనే వారిలో కూడా మహిళలే అత్యధికులు. గత ఎన్నికల్లో కూడా మగవారు 70.58 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మహిళలు 77.98 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తాజా ఎన్నికల్లో కూడా మహిళలు 76.8 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మగవారు కేవలం 72.4 శాతానికే పరిమితం అయ్యారు. అయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ చట్టసభలో వారికి తగిన ప్రాధాన్యం దక్కకపోవడం శోచనీయం.
New CM: నేడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని నిర్ణయించనున్న కాంగ్రెస్