Cm KCR Public Meeting: ఒళ్లు మరిచి ఓటేసి, ఇళ్లు కాల్చుకోవద్దు.. మునుగోడు బహిరంగ సభలో కేసీఆర్
ఒక్క నల్లగొండకే కాకుండా దేశానికే నరకం చూపించే జెండాలు మన మధ్యే తిరుగుతున్నాయి. వారిని గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాలను, నీళ్లను వేరు చేసే హంసలాగా ప్రజలు మారాలి. మంచిని, చెడుని వేరు చేయాలి. అది వచ్చిన్నాడే సమాజం బాగుంటుంది. మనం అనుకున్న పద్దతిలో పురోగమించగలం. ఎంతసేపు ప్రజలలో అమాయకత్వం ఉంటుందో, ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో, ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయే అమాయకత్వం ఉంటుందో, అప్పటి వరకు ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి.

KCR speech at chandu publice meeting for munugode by election
Cm KCR Public Meeting: ప్రజలు అమాయకంగా ఉన్నన్ని రోజులు దుర్మార్గులు రాజ్యాల్ని ఏలుతారని.. ఒళ్లు మరిచి ఓటేస్తే ఇళ్లు కాల్చుకోవడమే అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చండూరులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల విధి విధానాల్ని, వారి పోకడల్ని ప్రజలు ఎప్పటికప్పుడు పసిగట్టాలని పిలుపునిచ్చారు. హంస వలె పాలు, నీళ్లను వేరే చేసే శక్తిని తెచ్చుకొని మంచి, చెడులను వేరు చేయాలని కేసీఆర్ ప్రజల్ని కోరారు.
‘‘ఒక్క నల్లగొండకే కాకుండా దేశానికే నరకం చూపించే జెండాలు మన మధ్యే తిరుగుతున్నాయి. వారిని గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాలను, నీళ్లను వేరు చేసే హంసలాగా ప్రజలు మారాలి. మంచిని, చెడుని వేరు చేయాలి. అది వచ్చిన్నాడే సమాజం బాగుంటుంది. మనం అనుకున్న పద్దతిలో పురోగమించగలం. ఎంతసేపు ప్రజలలో అమాయకత్వం ఉంటుందో, ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో, ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయే అమాయకత్వం ఉంటుందో, అప్పటి వరకు ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే నేను దండం పెట్టి చెప్తున్నాను. ఏ ఊళ్లో ఉన్న విద్యాధికులు, ఏ ఊరిలో ఉన్న ఆలోచనాపరులు, పెద్దమనుషులు, యువకులు అలవోకగా ఓటేసి ఒళ్లు మరిచి ఓటేసి, ఇళ్లు కాల్చుకునే పని చేయొద్దని నేను కోరుతున్నాను’’ అని కేసీఆర్ అన్నారు.
ఇక దేశంలోని సంపద గురించి చెబుతూ కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది, పని చేసే ప్రజలు ఉన్నారు, అయినప్పటికీ నీళ్లు రావు. సాగు నీళ్లు రావు, తాగు నీళ్లు రావు. దేశం వంచించబడుతోంది. దేశంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఇప్పటికీ కోతలు తప్పడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని వర్గాల వారికి 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉంది. కరెంట్ సహా దేశంలోని వనరులు, సంపద అంతా కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు. కేంద్ర అవలంబించే బ్యాడ్ పాలసీ ద్వారా ప్రజలకు నీళ్లు రావు, కరెంటు రాదు’’ అని కేసీఆర్ విరుచుకుపడ్డారు.
Cm KCR Public Meeting: నల్గొండపై తాను రాసిన పాట గురించి చెప్పిన కేసీఆర్