హాట్ టాపిక్‌గా ఇరాన్, ఇజ్రాయెల్ వార్… అందుకేనా ఇరాన్ పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు!
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై మరొకరు తగ్గేదేలే అంటూ దాడులు చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ నిప్పు రాజుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బలాబలాల్లో ఒకరికొకరు తీసిపోని విధంగా ఉండడంతో పరిస్థితి సై అంటే సైగా మారింది. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇక ప్రతీకగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా విరుచుకు పడుతోంది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ బలాబలాలను చూస్తే సైనిక పరంగా రెండు శక్తివంతమైన దేశాలే.