అణు మిలిటరీ స్థావరాలనే లక్ష్యంగా… ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు!
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో, ఇప్పటికే ఈ ప్రాంతంలోని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ కూడా ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి.