‘ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు’… నైతికంగా గెలిచింది నేనే… మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా రౌడీయిజం, రిగ్గింగ్‌తో ఎన్నికలు జరిగాయని ఆమె మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై స్పందిస్తూ, “ఈ ఫలితాలు రౌడీయిజం, రిగ్గింగ్ వల్ల వచ్చినవి. స్వతహాగా వచ్చిన గెలుపు కాదు. నా భర్తకు కూడా గతంలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఏ పార్టీ మద్దతు లేకుండా మేము ఒంటరిగా పోరాడాం. నైతికంగా చూస్తే గెలిచింది నేనే” అని మాగంటి సునీత ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. మాగంటి సునీతపై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
