2021 సమ్మర్‌లోగా 10 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి

  • Published By: sreehari ,Published On : November 28, 2020 / 06:18 PM IST
2021 సమ్మర్‌లోగా 10 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి

Updated On : November 28, 2020 / 6:28 PM IST

10 Covid Vaccines 2021 Summer : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరోనా ట్రయల్స్ రేసులో పలు కంపెనీల వ్యాక్సిన్లు పోటీపడుతున్నాయి. వచ్చే ఏడాదిలో సమ్మర్ లోగా పది వరకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.



అలోగా రెగ్యులేటరీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ సురక్షితమని తేలాల్సి ఉంటుందని ప్రపంచ ఫార్మాసెటికల్ ఇండస్ట్రీ గ్రూపు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఫైజర్, బయోటెక్ వ్యాక్సిన్లతో పాటు మోడెర్నా, ఆస్ట్రాజెనికా పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహించాయి.



ఇందులో సానుకూల ఫలితాలే వచ్చాయి. ఇప్పటివరకూ ఈ మూడు వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ నోవాక్సిన్ ఫలితాలు కూడా సానుకూల వస్తాయని భావిస్తున్నామని Sanofi Pasteur తెలిపారు.



బిగ్ ఫార్మా కంపెనీలైన బయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి, రీసెర్చ్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయని ఆయన అన్నారు. తప్పనిసరి లైసెన్సింగ్‌ను అనుమతించేందుకు పేటెంట్ రక్షణను ఎత్తివేసి… నిపుణుల సిబ్బంది, నాణ్యతా నియంత్రణ విధానాలు లేకుండా సంక్లిష్ట నాణ్యత హామీ అవసరమయ్యే టీకాలను తయారు చేయడానికి ప్రయత్నించడం పొరపాటు చర్యగా పేర్కొన్నారు.



వచ్చే ఏడాది సమ్మర్‌లోగా 10 కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. కానీ, అన్ని వ్యాక్సిన్లపై కచ్చితత్వంతో పాటు సురక్షితమేనంటూ రెగ్యులేటర్లు సైద్ధాంతికంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.