Healthy Sleep Tips: ఈ ఫుడ్ మీ నిద్రను తినేస్తుంది.. మెదడును డ్యామేజ్ చేస్తుంది.. వీటితో జాగ్రత్తగా ఉండండి?
Healthy Sleep Tips: కాఫీలో ఉండే క్యాఫైన్ ఒక శక్తివంతమైన స్టిమ్యులెంట్ పదార్థం. ఇది నర్వస్ సిస్టంను ఉత్తేజితం చేసి, నిద్ర రాకుండా చేస్తుంది.

5 types of foods that disrupt sleep
నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. మంచి నిద్ర లేకపోతే శరీర ఆరోగ్యమే కాక మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. రాత్రిళ్ళు నిద్రపట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందికి కారణం ఆహారపు అలవాట్లు కూడా కారణం అవ్వొచ్చు. కొన్ని ఆహార పదార్థాలు నిద్రకు విఘాతం కలిగించవచ్చు. వాటికి దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి అలాంటి టాప్ 5 ఆహార పదార్థాల గురించి ఈ ఇక్క వివరంగా తెలుసుకుందాం.
1.కాఫీ (Coffee):
కాఫీలో ఉండే క్యాఫైన్ ఒక శక్తివంతమైన స్టిమ్యులెంట్ పదార్థం. ఇది నర్వస్ సిస్టంను ఉత్తేజితం చేసి, నిద్ర రాకుండా చేస్తుంది. రాత్రి సమయంలో కాఫీ తాగడం వల్ల నిద్ర రావడం ఆలస్యం కావచ్చు. అలాగే నిద్ర రాకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కాఫీకి దూరంగా ఉండాలి.
2.చాక్లెట్ (Chocolate):
చాక్లెట్‌లో కూడా క్యాఫైన్, థియోబ్రోమైన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. ప్రత్యేకించి డార్క్ చాక్లెట్‌లో ఇవి అధికంగా ఉంటాయి. రాత్రి తిన్నట్లయితే శరీరానికి నిద్ర లేకుండా చేస్తుంది.
3.అల్కహాల్ (Alcohol):
అల్కహాల్ తాగినప్పుడు మత్తు వల్ల తొలుత నిద్ర వచ్చేలా అనిపించొచ్చు. కానీ, అల్కహాల్ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. రాత్రి సగం వరకు మేలుకుని ఉండటానికి, పదేపదే మేలుకావడానికి ఇది కారణమవుతుంది.
4.మసాలాదార ఆహారం (Spicy Foods):
మిరపకాయలు, మసాలా పదార్థాలు ఉండే ఆహారం జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుంది. రాత్రివేళ ఈ రకమైన ఆహారం తీసుకుంటే, జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. ఇది నిద్రపై నెగటివ్ ప్రభావం చూపుతుంది.
5.చక్కెర అధికంగా ఉండే పదార్థాలు (Sugary Foods):
చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, పెరుగు లాంటి పదార్థాలలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్‌ను హఠాత్తుగా పెంచి శరీరాన్ని మేలుకునే స్థితిలో ఉంచుతాయి. ఇది నిద్ర లోపానికి దారితీస్తుంది.
నిద్రకు విఘాతం కలిగించే ఆహార పదార్థాలను తప్పించి, ఆరోగ్యకరమైన, తేలికపాటి ఆహారాన్ని రాత్రి తినడం మంచిది. ఉదాహరణకు పాలలో ఉండే ట్రిప్టోఫాన్, నెమ్మదిగా జీర్ణమయ్యే whole grains, పండ్లలో ఉండే మెలటొనిన్ వంటి పదార్థాలు నిద్రకు సహాయపడతాయి.