Get Pregnant : డైట్ లో మార్పులు చేస్తే అబార్షన్ల సమస్య ఉండదా? గర్భం నిలబడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవటం బెటర్?

గర్భం దాల్చాలనుకునే వారికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. కణ విభజనకు ఇది సహాయపడుతుంది. వైద్యులు ఫోలిక్ యాసిడ్ ను గర్భం దాల్చటానికి ముందు తరువాత కూడా సిఫార్సు చేస్తారు. గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్, బ్రోకోలి, ఎండు ద్రాక్ష, అరటి పండ్లు, త్రుణధాన్యాలు వంటి వాటి ద్వారా ఇది శరీరానికి అందుతుంది.

Get Pregnant : డైట్ లో మార్పులు చేస్తే అబార్షన్ల సమస్య ఉండదా? గర్భం నిలబడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవటం బెటర్?

get pregnant

Updated On : August 27, 2022 / 2:57 PM IST

Get Pregnant : పెళ్ళైన తరువాత ప్రతిమహిళ కోరుకునేది తల్లికావాలని. అయితే ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా గర్భం దాల్చటం కష్టతరంగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. లేటు వయస్సులో వివాహాలు ఒక కారణమైతే ఊబకాయం, మానసిక ఒత్తిడి , అనారోగ్య సమస్యలు ఇతరత్రా కారణాలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్ధపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని సార్లు మహిళలు గర్భం దాల్చినప్పటికీ అనుకోకుండా అబార్షన్లు అవుతున్నాయి. ఈ క్రమంలో అబార్షన్లు కాకుండా, గర్భం నిలబడాలంటే ముందుగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవటం ద్వారా అబార్షన్లను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

బీన్స్ ; ఇది ఫెర్టిలిటి బూస్టింగ్ గా పనిచేస్తుంది. బీన్స్ వంటి ప్లాంట్ ప్రొటీన్ తీసుకుంటే గర్భం త్వరగా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆనిమల్ ప్రొటీన్ తో పోల్చితే బీన్స్ ద్వారా
శరీరానికి అందే ప్రొటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మష్రుమ్ ; మష్రుమ్ లో విటమిన్ డి , పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గర్బం రావటానికి తోడ్పడటమే కాకుండా, పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి వీటిని తీసుకోవటం ఎంతో
ఉపయోగకరంగా ఉంటుంది.

డైరీ ప్రొడక్ట్స్ ; వెన్న, పాలు, చీజ్, బట్టర్, పెరుగు వంటి వాటిని ఎక్కవగా తీసుకోవటం వల్ల అబార్షన్ల సమస్యను నివారించవచ్చు. అంతేకాకుండా శిశువు ఆరోగ్యానికి మంచిది. వీటిలో
అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. అలాగే ప్రొటీన్ అధికంగా ఉండే చికెన్, చేప, పాలు, గుడ్లు వంటి డైరీ ఉత్పత్తులు కడుపులోని బిడ్డ కండరాలు, జుట్టు, చేతి గోళ్లు, ఎముకలు,
బ్రెయిన్ వంటి వాటికి తోడ్పడతాయి.

ఖర్జూరం ; ఖర్జూరం గర్భం దాల్చే అవకాశాలను పెంచటంలో సహాయకారిగా పనిచేస్తుంది. విటమిన్స్, మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం విత్తనాలను తొలగించి , అందులో కొత్తిమీర కాడలను ముక్కలుగా చేసి రెండింటిని కలిపి మీక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. దానిని ప్రతిరోజు ఉదయం కప్పు పాలల్లో కలుపుకుని వారం రోజులు పాటి సేవిస్తే త్వరగా గర్భందాల్చేందుకు అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ ; మహిళల్లో సంతానోత్సత్తి పెంచటంలో దానిమ్మ అద్భుతంగా ఉపయోగపడుతుంది. యూట్రస్ కు రక్తప్రసరణ సరిగే జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను పెంచటానికి సహాయపడుతుంది. ప్రతిరోజు దానిమ్మ గింజలు తినటం లేదంటే జ్యూస్ తాగటం మంచిది.

విటమిన్ డి ; మహిళల్లో విటమిన్ డి లోపం గర్భస్రావానికి దారితీస్తుంది. గర్భం దాల్చటానికి ముందుగా విటమిన్ డి స్ధాయిలను పరిశీలించుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే వెంటనే న్యూట్రిషియన్ ను సంప్రదించి ఆహారం ద్వారా తగిన మొత్తంలో విటమిన్ డి లోపాన్ని నివారించుకునేందుకు తగిన సూచనలు పొందాలి. రోజు ఉదయం , సాయంత్ర సమయాల్లో సూర్యరశ్మిలో 10 నిమిషాలు నిలబడాలి. విటమిన్ డి లభించే ఆహారాలను తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ ; గర్భం దాల్చాలనుకునే వారికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. కణ విభజనకు ఇది సహాయపడుతుంది. వైద్యులు ఫోలిక్ యాసిడ్ ను గర్భం దాల్చటానికి ముందు తరువాత కూడా సిఫార్సు చేస్తారు. గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్, బ్రోకోలి, ఎండు ద్రాక్ష, అరటి పండ్లు, త్రుణధాన్యాలు వంటి వాటి ద్వారా ఇది శరీరానికి అందుతుంది.

ఒత్తిడి తగ్గించుకోవటం ; గర్భం దాల్చిన వారు, గర్భం దాల్చలన్న ప్రయత్నాల్లో ఉన్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి అధికంగా ఉంటే సంతానోత్పత్తి పొందటం కష్టం. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి.