Brittle Nails : గోళ్లు విరుగుతున్నాయా… జాగ్రత్త

ఆరోగ్యకరమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. అందమైన గోళ్లు మంచి ఆరోగ్యానికి సూచన. కాకపోతే కొన్ని సార్లు కొందరిలో తరచుగా గోళ్లు విరిగిపోతుంటాయి. ఇది చిన్న సమస్యగానే కనిపించినా దాని వెనుక ఏదైనా బలమైన కారణం కూడా ఉండొచ్చు.

Brittle Nails : గోళ్లు విరుగుతున్నాయా… జాగ్రత్త

brittle nails

Brittle Nails : మన చర్మం, గోళ్లు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామోతెలియజేస్తాయంటారు నిపుణులు. అందమైన మృదువైన చర్మం, గోళ్లు చేతులకు, కాళ్లకూ అందాన్ని ఇవ్వడమే కాకుండా మనం ఆరోగ్యంగా ఉన్నామనడానికి సంకేతాలు కూడా. ఆరోగ్యకరమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. అందమైన గోళ్లు మంచి ఆరోగ్యానికి సూచన. కాకపోతే కొన్ని సార్లు కొందరిలో తరచుగా గోళ్లు విరిగిపోతుంటాయి. ఇది చిన్న సమస్యగానే కనిపించినా దాని వెనుక ఏదైనా బలమైన కారణం కూడా ఉండొచ్చు. అందుకే దానికి సరైన కారణం తెలుసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

READ ALSO : White Hair : పిల్లల్లో తెల్లజుట్టా…. అయితే ఇలా చేయండి

గోళ్లువిరగడానికి ఇవే కారణాలు

పోషకాహారం లోపం:

మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పోషకాలు లోపించినప్పుడు ఆ లోపం గోళ్లు విరగడంగా కనిపిస్తుంది. శరీరంలో ఐరన్ లోపంవల్ల ఈ సమస్య రావచ్చు. విటమిన్ ఎ, బి, సి,డి, ఈ, బయోటిన్ తక్కువ కావడం వల్ల గోళ్లు సున్నితంగా తయారవుతాయి.

జీవన శైలి:

తరచూ గోళ్లు కొరకడం, కెమికల్స్ వాడటం, ఎక్కువ సేపు నీళ్లలో లేదా వేడిలో ఉండటం వల్ల గోళ్లు బలహీనంగా తయారవుతాయి. ఫలితంగా చాలా సులువుగా విరిగిపోతుంటాయి.

READ ALSO : Sea found in Himalayas : హిమాలయాల్లో 60కోట్ల ఏళ్ల నాటి సముద్రాన్ని కనుగొన్న పరిశోధకులు .. వెలుగులోకొచ్చిన ఎన్నో ఆసక్తికర విషయాలు

ఆరోగ్య సమస్యలు:

థైరాయిడ్, సోరియాసిస్, డర్మటైటిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ సమస్య మొదలవ్వొచ్చు.

హార్మోన్లు:

మోనోపాజ్, ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల లో మార్పులు రావడం వల్ల గోళ్లు బలహీనంగా మారతాయి.

READ ALSO : Overeating : అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి ఉపశమనం కోసం !

గోళ్ల ఆరోగ్యం కోసం.. ఇలా చేయండి ;

హైడ్రేషన్:

గోర్లు పెరగడానికి కెరొటిన్ అనే ప్రొటీన్ అవసరం. మన శరీరంలో తగినంత నీటి శాతం ఉంటేనే ఈ ప్రొటీన్ వల్ల బాగా పనిచేస్తుంది. దీనివల్ల గోళ్లు బలంగా మారతాయి. అందుకే రోజంతాహైడ్రేటెడ్ గా ఉండాలి. తగినన్ని నీళ్లు తాగడం, పండ్ల రసాలు తీసుకోవడం ముఖ్యం.

రసాయనాలకు దూరంగా:

నెయిల్పాలిష్రిమూవర్స్ తరచూ వాడటం మంచిది కాదు. వాటిలో ఉండే ఎసిటోన్ వల్ల గోళ్లుపొడిబారి, బలహీనంగా మారతాయి.

READ ALSO : Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?

మాయిశ్చరైజ్ చేయాలి

గోళ్లుపొడిబారకుండా ఉండటం కోసం కొబ్బరి నూనెను వాడటం ఉత్తమం. ఆలివ్ నూనెలో కూడా విటమిన్ ఇ ఉంటుంది. ఈ నూనెల్ని గోళ్లకు, గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి రాసుకోవడం మంచిది.

సప్లిమెంట్లు

విటమిన్ డి, బయోటిన్, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సప్లిమెంట్లు గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. లేదా గుడ్లు, బాదాం, చిలగడ దుంపలు తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవచ్చు.

READ ALSO : Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

వీటికి దూరం

నెయిల్ఎక్స్‌టెన్షన్లు ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయాయి. కానీ ఆర్టిఫిషియల్ నెయిల్స్ తరచూ అంటించడం వల్ల గోళ్లు బలహీనపడతాయి. అందుకే ఈ సమస్య మొదలయ్యిందనిపిస్తే కొన్ని రోజులు వాటి జోలికిపోకండి. గోళ్ల రంగు కూడా వేయకుండా అలాగే కొన్ని రోజులు వదిలేయండి. సరైన హైడ్రేషన్, పోషకాలు అందితే ఈ సమస్య క్రమంగా తగ్గిపోతుంది.