Tea And Coffee : రోజు టీ, కాఫీలు తాగేస్తున్నారా? అయితే వాటిని తాగే ముందు నీటిని తీసుకోవటం అలవాటుగా మార్చుకోండి! ఎందుకో తెలుసా?

టీ లేదా కాఫీ తీసుకునే ముందు మీరు ఒక గ్లాసు నీరు త్రాగడానికి కారణం కడుపులో ఆమ్ల స్థాయిలను తగ్గించటమే. టీ సుమారు 6 pH విలువను కలిగి ఉంటుంది. మరొవిధంగా చెప్పాలంటే టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్‌) స్వ‌భావాన్ని కలిగి ఉంటాయి.

Tea And Coffee : రోజు టీ, కాఫీలు తాగేస్తున్నారా? అయితే వాటిని తాగే ముందు నీటిని తీసుకోవటం అలవాటుగా మార్చుకోండి! ఎందుకో తెలుసా?

drinking tea and coffee

Updated On : August 26, 2022 / 7:03 AM IST

Tea And Coffee : ఉదయం నిద్ర లేచిన తరువాత చాలా మందికి ఒక కప్పు టీ లేదా కాఫీ తాగి తమ రోజువారి దినచర్యను ప్రారంభించటం అలవాటు. చాలామంది భారతీయులు చేసేది ఇదే. రొటీన్ గా ఇది కొనసాగిస్తారు. బెడ్ టీ లేదా కాఫీ తీసుకోవడం చెడ్డ ఆలోచన అని చాలా మందికి తెలుసు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపై ఏమాత్రం అవగాహన ఉండదు. టీ లేదా కాఫీ తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు త్రాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం రోజులో ఎప్పుడు టీ,కాఫీలు సేవించినా ముందుగా కొన్ని నీటిని తీసుకోవటం మంచిది.

అయితే మ‌న‌లో అధిక‌శాతం మంది టీ లేదా కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగుతుంటారు. నిజానికి ఈ విధంగా ఎందుకు చేస్తారో తెలియ‌దు. ఇత‌రులు పాటిస్తున్న అల‌వాటును చూసి ఎవ‌రైనా అల‌వాటు చేసుకుంటారు. అస‌లు టీ, కాఫీ తాగేముందు నీటిని ఎందుకు తాగుతున్నారో తెలియ‌కుండానే ఆ ప‌ని చేస్తున్నారు. అలా చేయ‌డం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

టీ లేదా కాఫీ తీసుకునే ముందు మీరు ఒక గ్లాసు నీరు త్రాగడానికి కారణం కడుపులో ఆమ్ల స్థాయిలను తగ్గించటమే. టీ సుమారు 6 pH విలువను కలిగి ఉంటుంది. మరొవిధంగా చెప్పాలంటే టీ, కాఫీలు ఆమ్ల (యాసిడ్‌) స్వ‌భావాన్ని కలిగి ఉంటాయి. కాఫీ pH విలువ 5 గా ఉంటుంది. ఇది కూడా ఆమ్ల పరిధిలోకి వస్తుంది. కాబట్టి టీ లేదా కాఫీ తాగినప్పుడు, అది ఎసిడిటీని పెంచుతుంది. తీవ్రమైన అనారోగ్యాలు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. టీ, కాఫీకి ముందు నీరు త్రాగితే, ఇది కడుపులోని యాసిడ్ స్థాయిలను పలుచన చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి జరిగు హానిని తగ్గిస్తుంది.

ఇది అధిక ఆమ్ల స్థాయిల కారణంగా పళ్ళపై టీ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాగునీరు కూడా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది మరియు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. అందుక‌ని వాటిని తాగేముందు నీటిని తాగితే నోట్లో యాసిడ్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉంటుంది. క‌నుక టీ, కాఫీ తాగేముందు క‌చ్చితంగా నీటిని తాగాలి. టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల స‌హజంగానే మ‌న శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. శరీరంలో ఉండే నీరు బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. కనుక దాన్ని నివారించేందుకు టీ, కాఫీల‌కు ముందు నీటిని తాగటం అలవాటు చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.