Beauty Tips: నుదుటిపై మొటిమల సమస్య.. రెండు వారాల్లో మొత్తం మాయం.. జస్ట్ ఇలా చేయండి చాలు
Beauty Tips: మొటిమలు చిన్న చిన్నగా కనిపించినా ఒక్కసారిగా విపరీతంగా పెరుగుతుంటాయి. వీటి వెనుక ధూళి, చెమట, ఆయిల్, హార్మోనల్ మార్పులు, లేదా జంక్ ఫుడ్ కారణాలు ఉండవచ్చు.

Beauty tips to treat forehead acne
నుదుటిపై మొటిమలు (forehead pimples) అనేది సాధారణ సమస్య. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తూనే ఉంటుంది. మగవాళ్ళలో తక్కువే గానీ, ఆడవాళ్లను ఈ సమస్య ఎక్కువ బాధపెడుతుంది. మొహంపైనే ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొటిమలు చిన్న చిన్నగా కనిపించినా ఒక్కసారిగా విపరీతంగా పెరుగుతుంటాయి. వీటి వెనుక ధూళి, చెమట, ఆయిల్, హార్మోనల్ మార్పులు, లేదా జంక్ ఫుడ్ కారణాలు ఉండవచ్చు. అయితే, రోజువావారి జీవన విధానంలో మార్పుల వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి? సహజ చికిత్సలు, ఆహార మార్పులు, స్కిన్ కేర్ టిప్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం.
నుదుటిపై మొటిమలు రావడానికి ముఖ్యమైన కారణాలు:
- తైలం/చెమట అధికంగా ఉత్పత్తి కావడం.
- జుట్టు నుండి వచ్చే ఆయిల్స్, శాంపూల రసాయనాలు
- హార్మోనల్ మార్పులు (వయస్సు/స్ట్రెస్/PCOD)
- అసహజమైన డైట్ – తీపి, చాకొలెట్, ఫ్రై వంటకాలు
- క్లీనింగ్ రొటీన్ లేకపోవడం
- పిల్లో కవర్స్, మేకప్ బ్రష్‌లు శుభ్రంగా లేకపోవడం
ఇలా చేస్తే మొటిమలు మాయం:
1.రోజుకు 2–3 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి:
సబ్బు, ఫేస్ వాష్, సలిసిలిక్ యాసిడ్, నీం ఆధారిత ఫేస్ వాష్ లతో మొహాన్ని ఉదయం, రాత్రి తప్పనిసరిగా కడుక్కోవాలి.
2.పసుపు, తేనె ప్యాక్ ను వాడండి:
పసుపు, తేనె కలిపి చేసుకున్న పేస్ట్ ను ముఖంపై,నుదుటిపై అప్లై చేసి 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. వీటిలో ఉండే యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీలి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
3.టోనర్ వాడండి:
రోజ్ వాటర్ ను రోజుకు రెండు సార్లు ముఖంపై స్ప్రే చేయండి. అలాగే ఆపిల్ సిడర్ వినిగర్ 1:3 నిష్పత్తిలో నీటితో కలిపి కాన్ ప్యాడ్‌తో మొటిమల మీద రాయండి. దీనివల్ల బ్యాక్టీరియా నశిస్తుంది
4.ఆహార నియమాలు:
తినాల్సినవి:
- ఆకుకూరలు, తాజా పండ్లు (ఉసిరికాయ, బత్తాయి)
- వెల్లులి, వెల్లిపాయ, జీలకర్ర
- గ్రీన్ టీ, తులసి టీ (రోజుకి ఒక్కసారి)
- నీరు ఎక్కువగా తాగాలి (రోజుకు 2.5 లీటర్ల వరకు)
ఇవి తీసుకోకూడదు:
- చాకొలెట్, చీప్‌స, బేకరీ ఐటెమ్స్
- క్యాఫెయిన్, కొల్డ్ డ్రింక్స్
- చింతపండు, మసాలా ఆహారం
5. జీవనశైలి మార్పులు:
- రోజూ జుట్టు తల తప్పకుండా కడుక్కోవాలి, ఆయిల్ పెట్టుకున్న రోజు తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి.
- పిల్లో కవర్ వారానికి రెండుసార్లు మార్చాలి
- మొహాన్ని తరచూ చేతులతో తాకరాదు
- స్ట్రెస్ తగ్గించుకోండి
- ధ్యానం, యోగ చేయడం అలవాటు చేసుకోండి