Java Plum: నేరేడు పండ్లతో షుగర్ కంట్రోల్.. గింజల పొడి తింటే మందులు కూడా అవసరం లేదు

నేరేడు పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది.

Java Plum: నేరేడు పండ్లతో షుగర్ కంట్రోల్.. గింజల పొడి తింటే మందులు కూడా అవసరం లేదు

Java Plum benefits

Updated On : June 7, 2025 / 10:25 AM IST

ప్రస్తుతం సమాజాల్లో షుగర్ వ్యాధి దారుణంగా విజృంభిస్తోంది. రోజురోజుకి ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య చాలా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, జన్యు పరమైన సమస్యలు ఈ వ్యాధికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువగా ఈమహమ్మారీ బారిన పడుతున్నారు. ఈ డయాబెటీస్ సమస్య ఒక్కసారి వచ్చింది అంటే అంతే జీవితాంతం అలాగే ఉంటుంది. మందులతో కంట్రోల్ చేయగలమే కానీ, పూర్తిగా నయం చేయలేము. అందుకే.. షుగర్ పేషేంట్స్ షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అలాంటి వారికి నేరేడు పండు ఒక దివ్యౌషధం అని చెప్పాలి. ఈ పండులో ఆంథోసైనిన్లు, ఎలాజిక్ యాసిడ్ జాంబోలిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. అవి పిండిపదార్థాలను చక్కెరగా మార్చే వేగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర అమాంతం పెరిగే అవకాశం ఉండదు. అలాగే నేరేడు పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. నేరేడు పండులో ఉండే ‘జాంబోలిన్’ అనే సమ్మేళనం క్లోమ గ్రంధి ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసేలా చేస్తుంది. కాబట్టి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. నేరేడు పండ్లే కాదు నేరేడు గింజలు కూడా షుగర్ సమస్యను నయం చేయగలవాని నిపుణులు చెప్తున్నారు. ఈ గింజలు రక్తంలో చక్కెరను 30% వరకు తగ్గించగలవట.

నేరేడు గింజల్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. ఇవి కణాలకు చక్కర గ్రహించే శక్తిని అందజేస్తాయి. పరగడుపున రోజుకు ఒక టీస్పూన్ నేరేడు గింజల పొడి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. నేరేడులో ఉండే యాంటీఆక్సిడెంట్లు షుగర్ సమస్య వల్ల నరాలు, కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడతాయి. నేరేడు పండు లివర్‌ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సీజన్‌లో రోజూ కనీసం 5-6 నేరేడు పండ్లను తింటే మంచిది. ఖాళీ కడుపుతో మాత్రం ఈ పండ్లను తినొద్దు. ఎందుకంటే.. చక్కెరను మరీ చాలా వరకు తగ్గించే ప్రమాదం ఉంది. ఒకవేళ గింజలను వాడాలనుకుంటే, వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి వాడుకోవాలి.