Diabetes: మధుమేహానికి మందులు వాడితే ఏదైనా తినొచ్చా.. పెద్ద తప్పు చేస్తున్నారు.. ఇవి తప్పకుండా పాటించాలి
Diabetes: మందులు బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు కేవలం పని చేస్తాయి. కానీ, మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఎక్కువ షుగర్, కార్బోహైడ్రేట్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే, మందులు ఆ ప్రభావాన్ని తట్టుకోలేకపోతాయి.

Sugar patients Food Diet
ప్రెజెంట్ జనరేషన్ లో మధుమేహం వ్యాధి బారిన పడుతున్నవారు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు, ఒత్తిడి ఇలా చాలా రకాల కారణాల వల్ల షుగర్ వ్యాధి వ్యాప్తి ఘననీయంగా పెరుగుతోంది. అయితే, చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే మధుమేహానికి మందులు వాడుతున్నాం కదా ఏదైనా తినొచ్చు అని. కానీ, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకరం అవుతుంది. మందులు వాడుతున్నప్పటికీ షుగర్ పేషేంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు. మరి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు ఇది డేంజర్?
బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులు:
మందులు బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు కేవలం పని చేస్తాయి. కానీ, మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఎక్కువ షుగర్, కార్బోహైడ్రేట్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే, మందులు ఆ ప్రభావాన్ని తట్టుకోలేకపోతాయి. కాబట్టి అది ప్రమాదకరంగా మారె అవకాశం ఉంది.
హైపోగ్లైసేమియా ప్రమాదం:
కొన్ని మందులు తీసుకుని, తినకుండా ఉన్నా లేదా తినే టైం తప్పితే బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా తక్కువ అవుతాయి. దాని వల్ల బెహోష్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
బాడీ మీద ఒత్తిడి పెరుగుతుంది:
మందులు బ్లడ్ షుగర్ ను తగ్గిస్తాయి. అయితే మీరు జంక్ ఫుడ్స్ తింటే, లివర్, కిడ్నీ, హార్ట్ మీద ఆధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇవి నెఫ్రోపతి, రిటినోపతి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి దారి తీయవచ్చు.
మందులు వాడుతుంటే తప్పక పాటించాల్సిన ఆహార నియమాలు:
- కాంప్లెక్స్ కార్బ్స్: ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ (సజ్జలు, జొన్నలు) ఎక్కువగా తీసుకోవాలి
- కొద్దిగా ప్రోటీన్లు: ముడి పెసరపప్పు, మినపప్పు, బీన్స్, చికెన్ (గ్రిల్డ్) వంటి ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి
- నాన్-స్టార్చి వెజిటబుల్స్: కాకరకాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయ ఎక్కువగా తినాలి
- గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న పండ్లు: జామకాయ, నేరేడు, ఆపిల్, పేర్ సమయాన్ని బట్టి తినాలి
- శరీరానికి సరిపడా నీరు తాగాలి, హర్బల్ టీ లాంటివి తాగడం మంచిది
వీటిని తగ్గించాలి:
- స్వీట్స్, బెల్లం, తేనె, బేకరీ ఐటెం తినడం తగ్గించాలి
- వైట్ రైస్, మైదా, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి పదార్థాలు దూరంగా ఉండాలి
- సాఫ్ట్ డ్రింకులు, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి
- ఎక్కువ కార్బ్స్ ఉన్న పండ్లు అంటే అరటి, మామిడి, ద్రాక్ష లాంటివి తినకూడదు
ముఖ్యమైన సూచనలు:
- మందులు వేసుకున్న తర్వాత తప్పకుండా తినాలి. టైమ్ మిస్ అయితే హైపోగ్లైసేమియా వచ్చే ప్రమాదం ఉంది.
- రెగ్యులర్‌గా బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి.
- ఆహారం మోతాదు, టైమింగు, పదార్థాలు ఇవన్నీ మధుమేహ నియంత్రణకు చాలా ముఖ్యం.
- డాక్టర్ సలహా లేకుండా ఆహారం లో పెద్ద మార్పులు చేయడం మంచిది కాదు.
- షుగర్ పేషెట్స్ కేవలం మందులు వాడటం మాత్రమే సరిపోదు. ఆహార నియంత్రణ, వ్యాయామం, మానసిక ప్రశాంతత తప్పకుండ అవసరం.