Foot Inflammation: అరికాళ్లలో మంటగా అనిపిస్తుందా.. ఈ వ్యాధి లక్షణాలే కావచ్చు.. జాగ్రత్తగా ఉండండి

అరికాళ్ళలో మంటల సమస్యకు మదేమేహం ప్రధాన సమస్య కావచ్చు. కొన్నిసార్లు విటమిన్ శరీరంలో విటమిన్ బీ12 లోపం వల్ల కూడా అరికాళ్లలో మంటల సమస్య రావొచ్చు.

Foot Inflammation: అరికాళ్లలో మంటగా అనిపిస్తుందా.. ఈ వ్యాధి లక్షణాలే కావచ్చు.. జాగ్రత్తగా ఉండండి

Cause of Foot inflomation

Updated On : June 9, 2025 / 4:24 PM IST

అరికాళ్లలో మంటల సమస్య అనేది చాలా సాధారణమైనది. చాలా మందిలో ఇది కనిపిస్తూనే ఉంటుంది. కొంత కాలం ఉంది దానంతట అదే మానిపోతుంది. కొంతమంది అరికాళ్లలో మంటలు అంటే ఒంట్లో వేడి పెరడగం అనేది కారణంగా చెప్తారు. కొన్నిసార్లు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలాగే అరికాళ్లలో మాటలు అనిపిస్తుంది. అయితే.. కొన్నిసార్లు మాత్రం ఇది తీవ్రమైన సమస్యగా మారె ప్రమాదం ఉంది. నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు అంటున్నారు నిపుణులు. అందుకే అరికాళ్ళ మంటల సమస్య గురించి అందరు తెలుసుకోవాలి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది దేనికి సంకేతం అనేది ఇప్పడు తెలుసుకుందాం.

అరికాళ్ళలో మంటల సమస్యకు మధుమేహం ప్రధాన సమస్య కావచ్చు. కొన్నిసార్లు విటమిన్ శరీరంలో విటమిన్ బీ12 లోపం వల్ల కూడా అరికాళ్లలో మంటల సమస్య రావొచ్చు. థైరాయిడ్, కీమోథెరపీ లాంటివి కూడా దీనికి కారణం కావచ్చు. నరాలు బలహీనంగా ఉన్నప్పుడు కూడా అరికాళ్ళలో మంట, తిమ్మిరి, జలదరింపు వంటివి కలుగుతాయి. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం అథ్లెట్స్ ఫుట్ అని పిలువబడే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ మురికి, తడిగా ఉన్న సాక్స్, మాసిన షూస్, స్విమ్మింగ్ పూల్స్, బాత్రూమ్ లాంటి బహిరంగ ప్రదేశాల నుండి వ్యాప్తి చెడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, పాదాల కణాలకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

అయితే.. చిన్న చిన్న అలవాట్లను చేసుకోవడం వల్ల పాదాలలో మంట సమస్యను నివారించుకోవచ్చు. ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు రక్తంలో చక్కెరను అదుపులో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి12 పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా షూస్, సాక్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.