Benefits Of Stopping Eating Sugar: చక్కెర మానేస్తే శరీరంలో ఎం జరుగుతుందో తెలుసా? అలా చేయడం మంచిదేనా.. ఇవి తెలుసుకోండి

Benefits Of Stopping Eating Sugar: చక్కెర ఎంత తక్కువ తీసుకోవడం మంచిది. మరి అలా పూర్తిగా చక్కెరను మానేయడం నిజంగా మంచిదేనా? అలా పూర్తిగా చక్కెర మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి

Benefits Of Stopping Eating Sugar: చక్కెర మానేస్తే శరీరంలో ఎం జరుగుతుందో తెలుసా? అలా చేయడం మంచిదేనా.. ఇవి తెలుసుకోండి

Benefits of stopping eating sugar

Updated On : July 2, 2025 / 12:07 PM IST

మధుమేహం సమస్య ఉన్నవారు పూర్తిగా చక్కెర తీసుకోవడం మానేస్తారు. కొంతమంది భవిష్యత్తులో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేలా ముందు జాగ్రత్తగా చక్కెరను మానేస్తారు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల చక్కెర ఎంత తక్కువ తీసుకోవడం మంచిది. మరి అలా పూర్తిగా చక్కెరను మానేయడం నిజంగా మంచిదేనా? అలా పూర్తిగా చక్కెర మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర మానేస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే:

  • చక్కెర మానేసిన 1 నుంచి 3 రోజులలో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు క్రమబద్ధం అవుతాయి. బ్లడ్ షుగర్ స్పైక్స్ తగ్గుతాయి.
  • చక్కెర మానేసిన 7 రోజులకు తర్వాత శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చక్కెర మానేయడం వల్ల నీరసం తగ్గుతుంది. బ్లోటింగ్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
  • చక్కెర మానేసిన 1 నెల తర్వాత బరువు తగ్గడం ప్రారంభమవుతుంది, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
  • చక్కెర మానేసిన 3 నుండి 6 నెలలలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. శక్తి స్థాయి ఎక్కువ అవుతుంది.
  • చక్కెర మానేసిన 1 సంవత్సరం తర్వాత ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక స్పష్టత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం చక్కెర వాడకం తగ్గించడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువ అవుతుంది.

చక్కెర మానేయడం వల్ల వచ్చే తాత్కాలిక ప్రతికూల ప్రభావాలు:

చక్కెర మానేయడం వల్ల తాత్కాలిక తలనొప్పి, మూడ్ స్వింగ్స్, అలసట, ఎక్కువ ఆకలిగా అనిపించడం వంటివి జరగడం ఏర్పడుతుంది.

చక్కెర మానేస్తే కలిగే లాభాలు:

1.బరువు తగ్గడం: చక్కెరలో అధిక క్యాలరీలు ఉంటాయి. తక్కువ పోషక విలువతో ఉంటాయి. మానేసిన వెంటనే రోజుకు వందల క్యాలరీలు తగ్గవచ్చు.

2.ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది: ఇది మధుమేహ నియంత్రణకు చాలా ముఖ్యమైన అంశం.

3. లివర్ ఆరోగ్యం: ఫ్యాటీ లివర్ సమస్యను నయం చేస్తుంది. చక్కెర మానేసిన తర్వాత లివర్ ఫంక్షన్ మెరుగవుతుంది.

4. మెదడు పనితీరు: చక్కెర మానేసిన తర్వాత మెదడు పనితీరు పెరుగుతుంది.

5. కేన్సర్ ప్రమాదం తగ్గింపు: చక్కెర తీసుకోవడం తగ్గించడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ తగ్గవచ్చు.

చక్కెరను పూర్తిగా లేదా మితంగా మానేయడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మొదట కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఉండవచ్చు కానీ, దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చక్కెరపై నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి.