‘ఆ బలమే కరోనా నుంచి భారతీయులను కాపాడుతోంది’… చైనా డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 08:10 AM IST
‘ఆ బలమే కరోనా నుంచి భారతీయులను కాపాడుతోంది’… చైనా డాక్టర్ సంచలన వ్యాఖ్యలు

Updated On : April 28, 2020 / 8:10 AM IST

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్  వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ భారతీయులకు మానసిక స్థైర్యం ఎక్కువగా ఉందని, కాబట్టి వారు కరోనాకు భయపడం లేదన్నారు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని, చుట్టూ ఉన్నవారిలో 90 శాతం మంది వైరస్ సోకనివారేనని చైనా విద్యార్థులకు భరోసా కల్పించారు. 

ఝాంగ్.. షాంఘైలోని హౌషన్ హాస్పిటల్ లో డిపార్ట్ మెంట్ కు డైరెక్టర్ గా ఉన్నారు. భారతీయులు కరోనా వైరస్ ను ఎదుర్కొనగలరని అభిప్రాయ పడ్డారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా అమెరికాతో పోల్చితే చాలా తక్కువేనని తెలిపారు. భారతీయులకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని చెప్పారు. ప్రశాంత మనస్తత్వం కలవారని ఝాంగ్ వెల్లడించారు. 

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ తర్వాత అక్కడ తగ్గుముఖం పట్టింది. అనంతరం ఇటలీపై పెను ప్రభావం చూపింది. అత్యధికంగా వేల సంఖ్యలో మరణించారు. అమెరికాపై వైరస్ ప్రభావంగా ఎక్కువగా ఉంది. కేసుల నమోదు, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.