Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు పాటించాల్సిన ఆహార నియమాలు

కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయో తెలుసుకోవడం మంచిది. పిండి పదార్థాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి. బ్రౌన్ రైస్, బుక్వీట్ మరియు హోల్ ఓట్స్ వంటి తృణధాన్యాలు , పండ్లు , కూరగాయలు, చిక్‌పీస్, బీన్స్ మరియు కాయధాన్యాలు వంటి పప్పులు, తియ్యని పెరుగు, పాలు వంటివి వాటిని తీసుకోవాలి.

Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు పాటించాల్సిన ఆహార నియమాలు

healthy eating diabetes

Diabetes : మధుమేహంలో వివిధ రకాలు ఉన్నాయి. మధుమేహం ఉన్న వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ (చక్కెర), రక్తపోటు , కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా బరువు అదుపులో ఉంచుకోవటం, గుండె సమస్యలు, స్ట్రోక్స్ వంటి మధుమేహ సమస్యల ప్రమాదాన్ని, కొన్ని రకాల క్యాన్సర్‌ ల నుండి రక్షించుకోవచ్చు. మధుమేహం వల్ల ఎదురయ్యే సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవటం ప్రధానమైనదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారాలు ;

1. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవటం ;

అన్ని కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయో తెలుసుకోవడం మంచిది. పిండి పదార్థాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి. బ్రౌన్ రైస్, బుక్వీట్ మరియు హోల్ ఓట్స్ వంటి తృణధాన్యాలు , పండ్లు , కూరగాయలు, చిక్‌పీస్, బీన్స్ మరియు కాయధాన్యాలు వంటి పప్పులు, తియ్యని పెరుగు, పాలు వంటివి వాటిని తీసుకోవాలి. అదే సమయంలో, వైట్ బ్రెడ్, వైట్ రైస్, అధికంగా ప్రాసెస్ చేయబడిన తృణధాన్యాలు వంటి ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం చాలా ముఖ్యం.

2. ఉప్పు తక్కువగా తీసుకోవటం ;

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు ,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు గరిష్టంగా 6గ్రా (ఒక టీస్పూన్‌ఫుల్) ఉప్పు తీసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహారాలు అధిక ఉప్పును కలిగి ఉంటాయి కాబట్టి ఆహార లేబుల్‌ పరిశీలించిన తరువాతనే వాటిని తీసుకోవటం మంచిది. రుచికోసం ఉప్పుకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.

3. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినటం తగ్గించాలి ;

గొర్రె వంటి ఎరుపు , ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవటం మధుమేహులకు ఏమాత్రం మంచిది కాదు. వీటన్నింటికీ గుండె సమస్యలు , క్యాన్సర్‌లతో సంబంధాలు ఉన్నాయి. దీనికి బదులుగా బీన్స్, కాయధాన్యాలు , గుడ్లు చేప చికెన్ మరియు టర్కీ కోడి మాంసం వంటి పౌల్ట్రీ, ఉప్పు లేని గింజలు , బీన్స్, బఠానీలువంటివి తీసుకోవాలి. వీటిలో ఫైబర్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఏమాత్రం ప్రభావితం చేయవు. సాల్మన్, వంజరం వంటి చేపల్లో ఒమేగా 3 పుష్కలంగా ఉన్నందున వాటిని తినటం మంచిది.

4. ఎక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోవటం ;

పండ్లు,కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. భోజన సమయాల్లో ఎక్కువగా తినడం , ఆకలిగా ఉంటే వాటిని స్నాక్స్‌గా తీసుకోవడం మంచిది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్‌లను పొందడంలో ఇవి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు పండు తినే విషయంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి. పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. చాక్లెట్, బిస్కెట్లు మరియు కేక్‌ల వంటి వాటిలో చక్కెర కంటే పండ్లలోని చక్కెర భిన్నంగా ఉంటుంది.

5. ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవటం ;

ఆహారంలో కొవ్వు అవసరం ఎందుకంటే ఇది మనకు శక్తిని ఇస్తుంది. కానీ వివిధ రకాల కొవ్వులు మన ఆరోగ్యాన్ని పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉప్పు లేని గింజలు,, అవకాడోలు, ఓమేగా 3 కలిగిన చేపలు, ఆలివ్ నూనె, రాప్‌సీడ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటివి ఆహారాలలో ఉంటాయి. కొన్ని సంతృప్త కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచుతాయి. గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అసంతృప్త కొవ్వులు గొర్రె మాంసం , ప్రాసెస్ చేసిన మాంసం, నెయ్యి, వెన్న, పందికొవ్వు, బిస్కెట్లు, కేకులు, వంటి వాటిలో ఉంటాయి. నూనెల వాడకాన్ని తగ్గించడం మంచిది. వాటికి బదులుగా ఆహారాన్ని గ్రిల్, ఆవిరి పై ఉడికించి తీసుకోవటానికి ప్రయత్నించండి.

6. చక్కెరను తగ్గించటం ;

చక్కెరను తగ్గించడం మదుమేహులకు చాలా మంచిది. చక్కెర పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ , చక్కెర కలిపి పండ్ల రసాలను తగ్గించటం మంచిది. చక్కెరలను తగ్గించడం వలన మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో, బరువును తగ్గించటం సహాయపడుతుంది. జీరో క్యాలరీ స్వీటెనర్‌లను తీసుకోవటం మంచిది. అధిక కేలరీలు కలిగిన ఆహారాలు కానీ, దీర్ఘకాలంలో, మీ ఆహారంలో మొత్తం తీపిని తగ్గించడానికి ప్రయత్నించండి.

7. స్నాక్స్‌తో స్మార్ట్‌గా ;

చిరుతిండి తినాలన్న కోరిక కలిగితే చిప్స్, బిస్కెట్లు మరియు చాక్లెట్‌లకు బదులుగా పెరుగు, ఉప్పు లేని గింజలు, పండ్లు మరియు కూరగాయలను తీసుకోవాలి.

8. మద్యం సేవించటం ;

ఆల్కహాల్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారు మద్యం సేవించటం నివారించటం మంచిది. ఇన్సులిన్ తోపాటుగా ఇతర మధుమేహం మందులు తీసుకుంటే, ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిది కాదు.