Hypertension : బీపీ కంట్రోల్ తప్పుతోందా? అదుపులో పెట్టండిలా…

ఇటీవల కాలంలో చాలామందిని సతాయిస్తున్న సమస్య అధిక రక్తపోటు. బిజీ జీవితాలు.. మారిన జీవన శైలి చిన్న వయసులోనే దీని బారిన పడేలా చేస్తున్నాయి. అంజీరా పండ్లు తింటే బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Hypertension : బీపీ కంట్రోల్ తప్పుతోందా? అదుపులో పెట్టండిలా…

Hypertension

Updated On : May 3, 2023 / 1:58 PM IST

Hypertension : ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య బీపీ. వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అయితే బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మనం తినే ఆహారం కూడా ఎంతగానో సహాయపడుతుంది. అత్తిపండ్లు అని పిలవబడే అంజీర్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. ఈ విషయాన్ని వైద్యులు సూచిస్తున్నారు.

Avoid Diseases : బీపీ, షుగ‌ర్ వంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలంటే గ్లాసు పాలల్లో ఈ పొడిని కలపుకుని తాగితే చాలు!

రక్తపోటు చాలామంది ఎదుర్కుంటున్న సమస్య. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. మందులు వేసుకోవడం.. మంచి ఫుడ్ తీసుకోవడమే కాకుండా మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే కూడా బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్ధాల్లో పోషకాలు విపరీతంగా ఉంటాయి. అందులో అంజీర్ ఒకటి. అంజీర్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 లు పుష్కలంగా ఉంటాయి.

 

అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది. ముఖ్యంగా రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. రక్తపోటు ఉన్నవారిని పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినమని వైద్యులు సూచిస్తుంటారు. అంజీర్‌లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Eat For Breastfeeding : పాలిచ్చే తల్లులు ఎలాంటి పండ్లను ఆహరంగా తీసుకోవాలో తెలుసా?

ఉప్పు అధికంగా తీసుకుంటే బీపీ పెరుగుతుందని వైద్యులు చెబుతారు. పొటాషియం ఉప్పు చేసే హానిని నియంత్రిస్తుందట. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న సోడియం పోగొట్టుకోవడానికి సహాయపడుతుందట. ఎండిన లేదా తాజా అంజీర్‌లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయం చేస్తుందట. వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుందట.

 

కొలెస్ట్రాల్ స్ధాయిని కంట్రోల్‌లో ఉంచడానికి కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి. అంజీర్‌ను రాత్రివేళలో నీటిలో నానబెట్టి స్మూతీస్, షేక్స్, సలాడ్స్‌లలో కూడా చేర్చుకుని తినవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అంజీర్‌ని మీరు తినే ఆహారపదార్ధాల్లో చేర్చుకోమని వైద్యులు సూచిస్తున్నారు.