రోజుకో గుడ్డు తింటున్నారా? మీ ఆరోగ్యంలో ఈ మార్పులు గమనించారా?

Eating just ONE egg a day : గుడ్డు.. ఆరోగ్యానికి చాలా మంచిందంటారు.. అందుకే రోజుకో గుడ్డు తినండని చెబుతుంటారు. వాస్తవానికి రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది కాదంట.. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు తమ కొత్త అధ్యయనంలో ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించారు.
ప్రతిరోజు ఒక గుడ్డు తిన్నవారిలో డయాబెటిస్ ముప్పు 60 శాతం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రోజుకో గుడ్డు తిన్నవారిలో హైబ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు.
ఇలా రోజు తింటూ పోతే.. టైప్ 2 డయాబెటిస్ ముప్పును పెంచుతుందని కొత్త అధ్యయనంలో పేర్కొన్నారు.
చైనాకు చెందిన 8,545 మందిపై ఆస్ట్రేలియన్ రీసెర్చర్లు అధ్యయనంలో భాగంగా వారినుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించారు.
గుడ్డు తిన్నవారిలో హైబ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని గుర్తించారు. వాస్తవానికి యూకేలో గుడ్లను ఆరోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్‌గా భావిస్తుంటారు..
కానీ, అది క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తుందని అధ్యయనంలో రుజువైందని పరిశోధకులు గట్టిగా నొక్కిచెబుతున్నారు. రోజుకో గుడ్డు తింటే డయాబెటిస్ ను దూరం పెట్టొచ్చునని గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
https://10tv.in/moderna-says-its-vaccine-is-94-5-effective-in-preventing-covid-19/
కానీ, దీనిపై సైంటిఫిక్ పరంగా గందరగోళానికి గురిచేస్తోంది.. దీనిపై అనేక పరిశోధనలు, చర్చలు కూడా కొనసాగుతున్నాయి. కొత్త రీసెర్చ్ ప్రకారం.. ప్రతిరోజు ఒక గుడ్డును తిన్నవారిలో.. అది ఉడికించిన గుడ్డు కావొచ్చు.. ప్రై మాదిరిగా కుక్ చేసినా ఎలా తిన్నా సరే.. ఆ వ్యక్తి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మాత్రం అధికంగా పెరిగినట్టు అధ్యయనంలో తేలింది.