Hungry: తిన్నతరువాత కూడా ఆకలిగా అనిపిస్తుందా.. కారణం ఏంటో తెలుసుకోండి
భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం

Hungry Feeling
మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి ఆహరం తీసుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కొంత మంది ఎప్పుడు ఆకలైతే అప్పుడు తింటారు. కానీ, కొంతమంది టైం ప్రకారం తింటారు. అయితే కొంతమందిలో మాత్రమే కనిపించే లక్షణం ఏంటంటే? వీరికి తిన్న తరువాత కూడా ఆకలివేస్తుంది. దానికి కారణం ఆరోగ్య సమస్యేలేనని నిపుణులు చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి? తిన్న తరువాత కూడా ఎందుకు ఆకలి వేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం. మీరు డయాబెటిక్ లేదా ప్రీ-డయాబెటిక్ సమస్యతో బాధపడుతుంటే రక్తంలో చక్కర స్థాయిలు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది.
- శరీరంలో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు తగ్గడం వల్ల కూడా ఇంకా తినాలని అనిపిస్తుంది. కాబట్టి.. మీ భోజనంలో కచ్చితంగా ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోండి.
- మనం తీసుకునే ఆహరంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది బరువు తగ్గడం కోసమో లేదా ఇంకా ఎదో కారణాల వల్లనో డైట్ లాంటివి చేస్తుంటారు. అలాంటి సమయాల్లో శరీరానికి అవసరమైన కేలరీలు సరిగా అందకపోవడం వల్ల తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది. శరీరం శక్తి లేకుండా మారుతుంది. అధిక వ్యాయాయం కూడా దీనికి కారణం కావచ్చు.
- భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది అంటే.. శరీరానికి సరిపడా నీరు అందడం లేదని అర్థం. కాబట్టి, రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోండి.