కొవిడ్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌‌పై మొదటి హ్యుమన్ ట్రయల్ 

  • Published By: srihari ,Published On : June 3, 2020 / 10:44 AM IST
కొవిడ్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌‌పై మొదటి హ్యుమన్ ట్రయల్ 

Updated On : June 3, 2020 / 10:44 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 6 మిలియన్ల మార్క్ దాటేశాయి. లక్షలాది మంది ప్రాణాలను మహమ్మారి బలితీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన వైరస్ కేసులు ఆగడం లేదు. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒకటే ఆయుధం. కొవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. సైంటిస్టులు, నిపుణులు సైతం సమర్థవంతమైన వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. కరోనా చికిత్సకు యాంటీ బాడీ ట్రీట్ మెంట్ అందించేందుకు Gilead Sciences Inc కంపెనీకి ఆమోదం లభించింది. యాంటీ వైరల్ డ్రగ్ remdesivir మందును అత్యవసర సమయాల్లో వాడేందుకు అనుమతి పొందింది. కరోనా రోగులకు చికిత్స సమయంలో ఈ డ్రగ్ 5 డోసుల వరకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయిపోయాయి. 

ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో హ్యుమన్ ట్రయల్స్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి remdesivir యాంటీ వైరల్ డ్రగ్. క్లినికల్ ట్రయల్స్ కరోనా బాధితులకు ఈ డ్రగ్ ఇవ్వడంతో చాలామంది కోలుకున్నారు. ఈ డ్రగ్ ద్వారా కరోనా చికిత్స లేదా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం లేదు. అత్యవసర సమయంలో కరోనా చికిత్సకు ఈ డ్రగ్ వాడేందుకు గతనెలలోనే జపనీస్ హెల్త్ రిగ్యులేటర్ల నుంచి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు ఆమోదం లభించింది. అమెరికాతో పాటు భారత్, దక్షిణ కొరియాలో కూడా కరోనా అత్యవసర చికిత్స కోసం Gilead Sciences Inc కంపెనీ remdesivir డ్రగ్ వాడేందుకు ఆమోదం లభించింది. 

ఇదేవారంలో కరోనా పేషెంట్లకు ఇచ్చిన remdesivir డ్రగ్‌ను ఐదు రోజుల డోస్ ఇవ్వగా వారిలో సానుకూల ఫలితాలు కనిపించాయి. అధ్యయనంలో 10 రోజులు పాటు డోస్ పొందిన కరోనా బాధితుల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. 2020 నాటికి అమెరికా జనాభా సగానికి పైగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు సీనియర్ యూఎస్ ఆర్మీ వ్యాక్సిన్ రీసెర్చర్ చెప్పినట్టు రాయిటర్స్ నివేదించింది. అమెరికా ఫార్మాసెటికల్ కంపెనీ Eli Lilly, కంపెనీ కొవిడ్-19 మొదటి హ్యుమన్ ట్రయల్ ప్రారంభించినట్టు ప్రకటించింది. Indianapolis ఆధారిత డ్రగ్ తయారీ సంస్థ ప్రకారం.. కరోనా  నుంచి కోలుకున్న అమెరికా కొవిడ్-19 బాధితుడి నుంచి తీసుకున్న రక్త నమూనాలను సేకరించింది. జూలై ఆరంభంలో కొవిడ్-19 రోగులకు ప్రపంచ అతిపెద్ద డ్రగ్స్ ట్రయల్ నుంచి తొలి ఫలితాలు వెల్లడించనుంది. 

Read: కోవిడ్‌ను మాస్క్‌లు, సామాజికదూరం గట్టిగా అడ్డుకొంటున్నాయి. కొత్త అధ్యయనం ఇదే చెప్పింది